సదాశివ కోనలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న దశ్యం
ప్రజాశక్తి- పుత్తూరు టౌన్
రూరల్ మండలంలోని తణుకు గ్రామపంచాయతీలో శ్రీ శ్రీ సదాశివ స్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా తన అన్న కుమారస్వామి రెడ్డి ఆశీస్సులతో విఎస్‌ఎస్ పురం గ్రామంలో మంగళవారం వైసీపీ సీనియర్ నాయ కులు బి.మస్తాన్. ఆధ్వర్యంలో వేణుగోపాలపురం యూత్ యువకులకు తన సొంత ఖర్చుతో టీ షర్టులను భగవంతుని సేవలో అందించారు. అదేవిధంగా సదాశివ కోనలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కే.బాలాజీ, వీరస్వామి, చిన్నబ్బా మందడి, గిరి, గోవింద్ రెడ్డి, కే.బాబు, శివ, చిలకల వరాలు. నాగరాజు. సి బాలాజీ. తణుకు పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు.










