Sep 17,2023 22:52

ఉచిత మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ప్రారంభం
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌:
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్‌నర్స్‌ రెడ్డమ్మ కరోనాతో మతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం ప్రముఖ న్యాయవాది త్రిమూర్తి రెడ్డమ్మ ట్రస్ట్‌ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు స్థానిక 34వ డివిజన్లో 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మినరల్‌ వాటర్‌ అందించేందుకు వాటర్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేశారు. ఆదివారం రెడ్డమ్మ ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఏపీఎస్‌ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయ ఆనందరెడ్డి, టిడిపి నాయకులు టిసి రాజన్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా త్రిమూర్తి చేస్తున్న సేవలను కొనియాడారు. కార్పొరేటర్లు, వన్నెకుల క్షత్రియ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.