Mar 18,2022 23:03

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రోజా


ప్రజాశక్తి-పుత్తూరు టౌన్‌:
శుక్రవారం ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉచిత క్యాన్సర్‌ నిర్ధారణ వైద్యశిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ ఈ క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలంటే 5 నుండి 10 వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. స్విమ్స్‌ ద్వారా నడపబడుతున్న పింక్‌ బస్సు గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీల ఆరోగ్య పరిరక్షణ ద్యేయంగా పనిచేస్తోందన్నారు. పూర్తిగా మహిళ వైద్యబందంచే పరీక్షలు నిర్వహిస్తారని, అతి ఖరీదైన వైద్య పరీక్షలైన మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్‌, పాప్‌స్మియర్‌, మహిళలకు గర్భాశయ ప్రవేశం ద్వారా సంక్రమించే క్యాన్సర్‌, నోటి ద్వారా క్యాన్సర్‌ మొదలైన పరీక్షలు పింక్‌ బస్సులో చేస్తారన్నారు. కాబట్టి క్యాన్సర్‌ వ్యాధిని ముందుగానే గుర్తించగలిగితే పూర్తిగా నివారించడం సాధ్యమేనన్నారు. 40 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ హరి వైస్‌చైర్మన్లు డి.శంకర్‌, డి.జయప్రకాష్‌, కౌన్సిలర్లు, స్విమ్స్‌ హాస్పిటల్‌ వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు