Oct 02,2023 21:49

ఫొటో : మాట్లాడుతున్న ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభం
ప్రజాశక్తి-కావలి : రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు టైలరింగ్‌ శిక్షణ పొంది తద్వారా స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. శిక్షణ కార్యక్రమం పెన్షనర్స్‌ అసోసియేషన్‌ చేపట్టినందుకు వారికి అభినందనలు తెలిపారు. బాగా శిక్షణ పొందిన పదిమంది పేదవారికి పది కుట్టు మిషన్లు వితరణ చేస్తానని ప్రకటించారు.
వారి స్ఫూర్తితో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 5కుట్టుమిషన్లు, ఎ.వి.క్రుష్ణారావు ఒక కుట్టు మిషను, ప్రమోద్‌ ఒక కుట్టు మిషను వితరణ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో పందిటి కామరాజు, కలికి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ రెండు కార్యక్రమాలలో అధ్యక్షుడు ఆకుల రమణయ్యతోపాటు సహాధ్యక్షుడు రవికుమార్‌, కార్యదర్శి సాయిరాంసింగ్‌, కోశాధికారి వెంకయ్య, ఉపాధ్యక్షుడు రఘురామయ్య, కాలేషా, ఆదిశేషులు, శారద, సుకన్య, జమున తదితర కార్యవర్గ సభ్యులు, అనేకమంది సభ్యులు పాల్గొన్నారు.