Apr 09,2022 21:42

ఉచిత కంటి వైద్యశిబిరానికి విశేష స్పందన
ప్రజాశక్తి- కుప్పం: కుప్పం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శనివారం కుప్పం పిఈఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ అర్బన్‌ వైద్యశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉచిత కంటి వైద్యశిబిరానికి స్థానిక పిఈఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ వారు సహకారం అందించినట్లు లయన్స్‌ క్లబ్‌ సభ్యులు తెలిపారు. ఈ వైద్యశిబిరానికి దాదాపుగా 100 మందికి పైగా వద్ధులు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హాజరై ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కుప్పం లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు డాక్టర్‌ ఎ.మహేష్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రతినెలా రెండవ శనివారం నాడు ఉచిత కంటి వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేయాలని క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్ణయించామన్నారు. దీని వలన పేదవారికి వైద్యం చేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి 20 మందికి పిఈఎస్‌ మెడికల్‌ కాలేజ్‌ వారు కాంట్రాక్ట్‌ చికిత్సకు వైద్యం అందించుటకు ముందుకు వచ్చినట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా లయన్స్‌ క్లబ్‌లో సభ్యులు అయినటువంటి డిఆర్‌ ఆప్టికల్స్‌ దశరథ వారి సిబ్బందితో వైద్యశిబిరానికి పూర్తి సహకారాన్ని అందించినట్లు తెలిపారు. అలాగే కుప్పంలోని ఆధ్యా సాఫ్టెక్‌ సొల్యూషన్స్‌ సీఈఓ హారిక చంద్రశేఖర్‌ వారి సిబ్బంది వైద్యశిబిరంలో పాల్గొని వైద్యశిబిరాన్ని విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా కుప్పం ఇంజనీరింగ్‌ కాలేజ్‌ వైస్‌చైర్మన్‌ లయన్స్‌ డాక్టర్‌ సునీల్‌రాజ్‌, ఆర్‌ఆర్‌.రవి, సెల్వం, సెంథిల్‌, రవీంద్రనాథ్‌, చంద్రశేఖర్‌, లెనిన్‌, శివ, వెంకీ, రవి, తదితరులు పాల్గొన్నారు.