ప్రజాశక్తి-కలకడ : ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించినట్లు పంచాయతీ కార్యదర్శి జయచంద్ర తెలిపారు. మండలంలోని ఏనుగొండ పాలెం పంచాయితీ దిగువ పాలెం ప్రాథమికోన్నత పాఠశాల నందు స్థానిక సర్పంచ్ మంజుల మోహన్ రాజా నాయుడు ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణానికి చెందిన ఎల్.వి.ప్రసాద్ నేత్ర వైద్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు సుమారు 50 మందికి పైగా కంటికి సంబంధించిన స్థానికులు వచ్చి వైద్య సేవలు పొందారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారి బి.రాజు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.










