Apr 07,2023 16:37

అభినందించిన నారా లోకేష్‌
ప్రజాశక్తి - పాలకోడేరు
తూర్పు, పశ్చిమగోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాల టిడిపి ఎస్‌టి సెల్‌ కమిటీ ఇన్‌ఛార్జిగా గొల్లలకోడేరుకు చెందిన సాల మల్లేశ్వరరావును రాష్ట్ర ఎస్‌టి సెల్‌లో కమిటీ ఇన్‌ఛార్జి కొండారెడ్డి నరహరి వరప్రసాద్‌ నారా లోకేష్‌ ఆదేశాల మేరకు ఎంపిక చేశారు. ఈ మేరకు మల్లేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ప్రస్తుతం ఎస్‌టి సెల్‌ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నానని, టిడిపిలో చురుకైన పాత్ర వహించడంతో ఉభయగోదావరి జిల్లాల ఎస్‌టి సెల్‌ కమిటీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎస్‌టి సెల్‌ కమిటీని ఎంపిక చేశారని, త్వరలో మూడు జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసి రెండు జిల్లాల్లో టిడిపి బలోపేతం చేస్తానని మల్లేశ్వరరావు తెలిపారు. ఈ క్రమంలో తాను పాదయాత్రలో లోకేష్‌ను కలిశానని ఆయన అభినందించారని తెలిపారు. ఇన్‌ఛార్జి పదవి రావటంలో ఉండి ఎంఎల్‌ఎ రామరాజుతోపాటు జిల్లా, మండల నాయకులు సహకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎకు మల్లేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు