Mar 26,2023 15:55

ప్రజాశక్తి-పాలకొల్లు : తూర్పుకాపులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఓబీసీ సమస్యను త్వరితగతిన పరిష్కారం చెయ్యాలని డిసిఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ సీఎం జగన్ ను కోరారు. దెందులూరు వచ్చిన సిఎంకు ఆయన వినతిపత్రం సమర్పించారు. 2008లో తూర్పు కాపుల ఇబ్బందులు గ్రహించిన డా రాజశేఖర్ రెడ్డి బీసీ రిజర్వేషన్ GO ఇచ్చారని, 9 సంవత్సరాల అనంతరం చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఆ G.O  ఎత్తివేశారని చెప్పారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే ఉన్న అవకాశం రాష్ట్రంలో ఉన్న ప్రతి తూర్పు కాపుకు అందించాలని కోరారు. స్పందించిన సీఎం బీసీ కమిషన్ కు వివరాలు తెలియజేయాలనీ సమస్య పరిస్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తాతాజీ పాలకొల్లులో మీడియాకు చెప్పారు.