ప్రజాశక్తి - పెనుమంట్ర : ప్రతి ఉపాధ్యాయుడు తమ పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాలను పనితీరును సోషల్ ఆడిట్ యాప్ ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని ఎంఈఓడి శారద జ్యోత్స్న అన్నారు. బుధవారం పెనుమంట్ర హైస్కూల్లో సోషల్ ఆడిట్ యాప్ పై మండలం పరిధిలోని హైస్కూల్, యూపీ, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా శారద జ్యోత్స్న మాట్లాడుతూ ప్రతి పాఠశాలలోనూ మౌలిక సదుపాయాలు, వనరులు, విద్య ప్రమాణాలు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వంటి వాటిని పర్యవేక్షణ చేసి ఆడిట్ యాప్ ద్వారా ఉన్నతాధికారులకు నివేదిక పంపాలని అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో సామాజిక తనిఖీ, పేరెంట్స్ కమిటీ తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించుట వంటి వాటితో దృష్టి సాధించాలని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి స్టేట్ పిఆర్ గా ఎన్ బుచ్చిబాబు శిక్షణ ఇచ్చారు.










