ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో బుధవారం ట్రైన్ డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధన్ రెడ్డి పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం ఎలా ఉంది మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నీటి సౌకర్యం ఉందా లేదా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగారు. అదేవిధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నవీధాతో మాట్లాడుతూ పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం కచ్చితంగా మెనూ ప్రకారం విద్యార్థులకు అందవ్వాలని భోజనం నాణ్యత ఎలా ఉంది అనేది ఉపాధ్యాయులు తిని చూసి విద్యార్థులకు వడ్డించాలని తెలిపారు. ఆయనతోపాటు ఎంపీడీవో దివాకర్, బండ్లపల్లి ఎంపీటీసీ శంకర్ యాదవ్, పాఠశాల కమిటీ చైర్మన్ బాలకృష్ణ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్, ఉపాధ్యాయనీయులు హేమలత, అర్చన, తదితరులు పాల్గొన్నారు.










