Apr 10,2023 15:25

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నగరంలోని నిరుపేద ముస్లింలకు సోమవారం రంజాన్ తోఫాను నగర మేయర్ మహమ్మద్ వసీం వైసీపీ సీనియర్ నేత అనంత చంద్రారెడ్డితో కలసి పాల్గొన్నారు. నగరంలోని చాందిని మసీదులో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పవిత్ర రంజాన్ పండుగను పేదలు కూడా సంతోషంగా జరుపుకునేలా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు  ఇషాక్, అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.