Jun 28,2023 13:01

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ డాక్టర్ థామస్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు వెదురుకుప్పం టీడీపి శ్రేణులు. వెదురుకుప్పం మండల పార్టీ కేంద్రంలో మండల అధ్యక్షులు కామసాని లోకనాధ రెడ్డి  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నరసింహ యాదవ్, రాష్ట్ర సాంస్కృతిక విభాగ కార్యదర్శి ముని చంద్రారెడ్డి,  జిల్లా సాధికార సమితి అధ్యక్షులు కోల జయచంద్ర, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి బుజ్జి బాబు, జిల్లా వాణిజ్య విభాగా కార్యదర్శి రమణారెడ్డి, క్లస్టర్ ఇంచార్జ్ చంగల్ రాయల్ రెడ్డి, జిల్లా క్రిస్టియన్ సెల్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, గాలి రమేష్ నాయుడు, రమేష్ రెడ్డి, లోకనాథ్ రెడ్డి, రాజయ్య, వర్మ, చిరంజీవి నాయుడు, వెంకటాద్రి నాయుడు, బాలాజీ రెడ్డి, జయచంద్ర రెడ్డి, గుణ శేఖర్ రెడ్డి, మారేపల్లి మురళి, డేరంగుల జయచంద్ర, దామోదర్ రెడ్డి, రామయ్య, కురివికుప్పం శంకర్, మోహన్ రెడ్డి, దేవేంద్ర, ముని రాజా రెడ్డి, చిన్నమరెడ్డి, తదితరులు సీనియర్‌ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.