ప్రజాశక్తి-ఆత్మకూరు : ఆత్మకూరు మండల పరిధిలో పాపంపల్లి గ్రామం నకు చెందిన తెలుగు దేశం పార్టీ కార్యకర్త రేనాటి నాగరాజా రెడ్డి పాము కాటుతో మృతి చెందాడు. అతని కుమార్తె, కుమారుడు ఆర్.లిఖిత, ఆర్.శ్రవణ్ కుమార్ రెడ్డిలను, అలాగే రేనాటి జయరామి రెడ్డి కుమార్తె ఆర్. అలేఖ్యలను N. T. R ట్రస్ట్ ద్వారా చదివించుటకు అవకాశం కల్పించిన పరిటాల సునీత గారికి, పరిటాల శ్రీరామ్ ని కలిసి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కలిసిన వారిలో రేనాటి వెంకట రామిరెడ్డి, రేనాటి శ్రీనివాసులు రెడ్డి, రేనాటి జయరామి రెడ్డి, రేనాటి రామకృష్ణ రెడ్డి, లక్ష్మి నారాయణ రెడ్డి,కన్వీనర్ శ్రీనివాసులు, నరసింహులు పాల్గొన్నారు










