Apr 29,2023 16:14
  • ఎమ్మెల్యే దంపతులకు, నార్పల సత్యనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ 

ప్రజాశక్తి-నార్పల : రిజర్వేషన్ల ద్వారా తమకు గొప్ప అవకాశాన్ని  ఉన్నత స్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ఆయనతోపాటు వేదికను పంచుకునే గొప్ప అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆలూరు సాంబశివారెడ్డి దంపతులకు అనంతపురం జిల్లా మాజీ మార్కెట్ చైర్మన్ నార్పల సత్యనారాయణరెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటామని జడ్పీ వైస్ చైర్పర్సన్ వేదాంతం నాగరత్నమ్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో భాగంగా ఈనెల 26న సింగనమల నియోజకవర్గం నార్పల మండలంలో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఈ కార్యక్రమం నార్పలలో జరగడం మన అందరి అదృష్టమని, ఇంత గొప్ప కార్యక్రమంలో ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డితో పాటు మాకు స్టేజి మీద కూర్చునే అవకాశం కల్పించినందుకు ఆయన దీవెనలు అందుకున్న మాకు, రాజకీయంగా మమ్ములను గుర్తించి పదవులు ఇచ్చిఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మా రాజకీయ గురువు అయినటువంటి నార్పల సత్యనారాయణ రెడ్డి వారి కుటుంబానికి సింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ప్రభుత్వ విద్యా సలహాదారులు ఆలూరు సాంబశివరెడ్డికి మాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు నేను ప్రత్యేకంగా శతకోటి పాదాభివందనాల తెలుపుతున్నాను అని బడుగు బలహీన వర్గాల కుటుంబానికి చెందినటువంటి మాకు రిజర్వేషన్లు కల్పించి రాజకీయంగా ఇంతటి గుర్తింపు ఇంత గొప్ప అవకాశాన్ని మాకు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా ఆజన్మాంతం రుణపడి ఉంటామని తెలిపారు  అదేవిధంగా మా జీవితమంతా పార్టీలో కృతజ్ఞతగా కమిట్మెంట్తో పని చేస్తామని అన్నారు.