Oct 17,2023 22:12

ఠాగూర్‌

ప్రజాశక్తి - పలాస : నీట్‌ సూపర్‌ స్పెషాలిటీ ఎం.ఎస్‌ జనరల్‌ పిజి ప్రవేశ పరీక్షా ఫలితాల్లో కాశీబుగ్గ న్యూకాలనీకి చెందిన కిల్లి ఠాగూర్‌ ఆలిండియా స్థాయిలో 112వ ర్యాంకు సాధించారు. ఠాగూర్‌ కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్‌ పూర్తి చేశారు. ఢిల్లీలోని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మెడికల్‌ కళాశాలలో ఎం.ఎస్‌ చేశారు. ఠాగూర్‌ తండ్రి కోదండరావు స్వర్ణకారుడు కాగా, తల్లి ఉమ గృహిణి. సోదరుడు పాలిటెక్నికల్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేస్తున్నారు. ఠాగూర్‌ ర్యాంకు సాధించడంపై కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.