ప్రజాశక్తి-గణపవరం : కౌలు రైతు చట్టం సవరించి భూమి యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు కౌలు కార్డులు ఇవ్వాలని గురువారం కౌలు రైతుసంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కేశవరం రైతు భరోసా కేంద్రం వద్ద దర్నానిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గోన్న కౌలు రైతుల సంఘం జిల్లా నాయుకులు పి.నరశింహమూర్తి మాట్లాడుతూ వ్యవసాయంలో 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం 2011 కౌలు చట్టాన్నిరద్దు చేసి పంట సాగుహక్కు తప్పనిసరి చేయటంతో ఎక్కువమంది కౌలురైతులకు కౌలుకార్డులు రాకపోవటం వలన బ్యాంకు రుణాలు పంటభీమా పంటనష్టం పరిహరం చివరికి పంట అమ్ముకోవాడానికి కూడ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కార్డులు లేకపోవటం వలన వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగి అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకోనేది కౌలురైతులేనని అన్నారు. ప్రభుత్వం గ్రామ సభలు ద్వారా కౌలు రైతులను గుర్తించి కార్డులు అందించాలని అన్నారు. కేరళ ప్రభుత్వం తరహలోఋణ విముక్తీ చట్టాన్నిచేసి కౌలసన్న.చిన్నకారు రైతులకు ఋణాలు రద్దు చేయాలని అన్నారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా 25.వేలు ఇవ్వాలని అన్నారు. ధర్నా అనంతరం వ్వవసాయ సహయకులు ఎంవెంకటప్రసాద్ కి వినతిపత్రం అందచేసారు. ఈ ధర్నాలో సంఘం మండల కమిటి అద్యక్షులు బసవ ఎర్రి నాయుడు నాయకులు దొంగ సత్యనారాయణ, ఎం వెంకటరావు, రైతులు ఎస్ సంజీవరావు, పేట లక్ష్మణరావు, జోగి సత్యనారాయణ, కౌరురామచందరావు పాల్గున్నారు.










