Mar 23,2023 13:12

ప్రజాశక్తి- ఆత్మకూరు : మార్చి 1వ తేదీకి భానుడి ప్రతాపంపై ఐఎండీ తొలి హెచ్చరిక నేపధ్యంలో అధిక ఉష్ణోగ్రతల నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురవారం మార్గదర్శకాలను జారీ చేసింది. కావున ఆత్మకూరు మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు రైతు కూలీలు ఉపాధి హామీ కూలీలు మరియు పిల్లలను వృద్ధులను ఎండల నుంచి జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆత్మకూరు ప్రాథమిక ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ దయాకర్ తెలియజేశారు. గురువారం ప్రజాశక్తి తెలిపారు. డాక్టర్ దయాకర్ మాట్లాడుతూ ప్రజలు  భగభగ మండుతూ సూర్యుడు  నుంచి జాగ్రత్త ఎలా తీసుకోవాలో పని చూచనలు ప్రజలకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ఎండలు మండుతున్న క్రమంలో ప్రజలు తగినంతగా నీరు తాగాలని మార్గదర్శకాల్లో సూచించింది. వేడిగాలుల నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఏం చేయకూడదనే వివరాలతో మార్గదర్శకాలను జారీ చేసింది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్‌) తీసుకోవాలి మజ్జిగ, నిమ్మరసం, పండ్ల రసాలు తాగాలి వదులైన కాటన్ దుస్తులు ధరించాలి గొడుగు, క్యాప్‌, టవల్‌తో తలను కవర్ చేసుకోవాలి చల్లని ప్రదేశాల్లో ఉండేలా చూసుకోవాలి.. ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయట పనులను చక్కబెట్టుకోవాలి. 

చేయకూడనివి.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య బయటకు రాకూడదు ఒత్తిడితో కూడిన పనులకు దూరం చెప్పులు లేకుండా బయటకు రాకూడదు అని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో వైద్య నిమిత్తం గ్రామంలో ఉన్న ఆశ వర్కులను, సచివాలయ హెల్త్ క్లినిక్ నర్సులను సంప్రదించి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి చేరి వైద్యం చూసుకోవాలని తెలియజేశారు.