ప్రజాశక్తి-కదిరి : టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ జూన్ 5 బస్సు యాత్ర శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జూన్ 5 అనంతపురం కడప కర్నూల్ జిల్లాల నాయకులు తరలివచ్చి ముందుగా కదిరి పట్టణంలోని శ్రీమద్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్ర మసీదు నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించి రాయలసీమ సర్కిల్, టవర్ క్లాక్, వేమారెడ్డి సర్కిల్లోకు చేరుకొని బహిరంగ సభలో పలువురు ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, మాజీ మంత్రి వర్యులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎంపి నిమ్మల కిష్టప్ప, కందికుంట వెంకట ప్రసాద్,పరిటాల శ్రీరామ్, ఎమ్మెల్యే బీటీ నాయుడు, మాజి మంత్రి నంద్యాల జిల్లా షారుఖ్, మాజీ ఎమ్మెల్సీ తీప్పేసామీ,.శింగనమల ఇన్ చార్జ్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.










