Sep 01,2022 15:41

ప్రజాశక్తి-వెదురుకుప్పం : తెలుగుదేశం పార్టీ వెదురుకుప్పం మండలం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పేదల బియ్యాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇవ్వనందుకు నిరసన చేపట్టి వెదురుకుప్పం మండల  ఉపతహసిల్దార్‌ గారికి మండల టిడిపి అధ్యక్షులు కె.లోకనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం టిడిపి జిల్లా మాజీ కార్యదర్శి మోహన్ మురళి మాట్లాడుతూ జాతీయ ఆహార భద్రత చట్టాన్ని అనుసరించి రాష్ట్రంలోనే ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికి ఉచిత బియ్యాన్ని  అందించాలని అయిన డిమాండ్ చేశారు జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం ప్రతి పౌరుడికి ఆకలి తీర్చడం ప్రభుత్వల యొక్క విధి అయితే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టానికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని అయిన్నరు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 2022 నుండి ఉచితబియ్యం పంపిణీ నిలిపివేయడం దుర్మార్గ చర్యని మోహన మురళి తెలియజేశారు ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ టి ఎన్ టి యు సి అధ్యక్షులు గాలి బాబు నాయుడు, టిడిపి మండల యువత అధ్యక్షులు సురేష్ కుమార్ రెడ్డి ,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వరప్రసాద్ ,మండల టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఢిల్లీ ప్రసాద్ రెడ్డి ,గ్రామ కమిటీ అధ్యక్షులు చెంగల్రాయిరెడ్డి, వెంకటాద్రినాయుడు,మోహన్ యాదవ్,మండల యువ నాయకులు ఎస్.ఉదయ్ కుమార్, జయరామరెడ్డి,చంద్రశేఖర్, మాంబేడు చిన్ని, తదితరులు వినతిపత్రం సమర్పించారు