Apr 10,2023 15:30

ప్రజాశక్తి-హిందూపురం : అధికారం రాక ముందు పెంచము అని నమ్మబలికి జగన్ ఏడుసార్లు  విద్యుత్ చార్జీల పెంచి ప్రజలు నడ్డి  విరిచారు. శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ ఆదేశాలతో హిందూపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో  విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా కనకదాస సర్కిల్ మరియు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుండి ర్యాలీగా వెళ్లి డిఈ కార్యాలయం ముందు బైఠాయించి విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న నిరుపేద, పేద, మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు పెంచి భారం వేస్తోందని, వైస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 7 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారని వారు ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొరత నుండి విద్యుత్ ఇతర రాష్ట్రాలకు అందించే స్థాయికి వెళ్లి విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచారన్నారు. కోతలులేని నాణ్యమైన విద్యుత్ అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడమే కానీ విద్యుత్ సేవలు చేయడం లేదని ఆప్రకటిత కోతలతో ప్రజలకు ఇబ్బందులు పాలు చేస్తోందని వారు ఆరోపించారు. ప్రజలుపై భారం మోపే ప్రభుత్వ విధానాలను ప్రజలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ పట్టణ అధ్యక్షులు డిఈ రమేష్ కుమార్ నాయకులు నాగరాజు రాష్ట్ర కార్యదర్శి కొల్లకుంట అంజినప్ప మండల కన్వీనర్ అశ్వర్త రెడ్డి రాష్ట్ర బీసీ తెలుగు మహిళ  మైనార్టీ st సెల్  తెలుగు మహిళ ఎస్టీ కార్యదర్శిలు బెవనహల్లి ఆనంద్ అమరనాథ్ పరిమళ డైమండ్ బాబా వెంకటరమణ సీనియర్ నాయకులు నెట్టప్ప భాస్కర్ HN రాము రామకృష్ణ రెడ్డి కౌన్సిలర్ల సతీష్ రాఘవేంద్ర పార్లమెంట్ వాణిజ్య విభాగపు అధ్యక్షులు జేపీకే రాము, లీగల్ సెల్ అధ్యక్షులు శివశంకర్, పట్టణ బీసీ తెలుగు మహిళ తెలుగు యువత అధ్యక్షులు దుర్గా నవీన్, విజయలక్ష్మి, సురేష్, నాయక్ ,ఐటిడిపి అధ్యక్షులు నజీర్ అహ్మద్, నాయకులు సుమోసీనా ప్రెస్ వెంకటేష్, కొరుముట్ల నాగేంద్ర,  రవీంద్ర, నాయుడు ప్రసాద్,  పార్లమెంట్ కార్యదర్శి ఆదినారాయణ ప్రధాన కార్యదర్శి దాదాఖాన్ దాదాపీర్, ఉమా మహేశ్వర రెడ్డి మంజునాథ్, రవి, అశోక్, షబ్బీర్ అమీన్ కురుబ వెంకటేష్ సాదిక్ గీతమ్మ గంగమ్మ వాసు శంకర్  సికందర్  ఫాజిల్  వలి  తదితరులు పాల్గొన్నారు.