Mar 22,2023 14:44
  • టిడిపి జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి.

ప్రజాశక్తి-భీమవరం : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో భీమవరం టిడిపి కార్యాలయములో నియోజవర్గ టిడిపి నాయకులు ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శోభకృత నామ సంవత్సరం అందరకి శుభం చేకురాలిని,టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పట్టభద్రుల ఎన్నికల విజయాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా ఇదిఆంధ్రుల విజయంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిలేక నిత్యవసర సరుకులు గ్యాస్, పెట్రోల్ అధిక ధరలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి అవుతున్నారని ప్రజలు కష్టాలు పోవాలంటే తిరిగి చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ గడచిన 4 సంవత్సరాల వైసిపి పాలనలో జగన్ బడుగు బలహీన వర్గాల నుండి సంపన్నుల వరకు తీవ్ర కష్టనష్టాలకు గురిచేశారని విమర్శించారు.రాష్ట్ర కార్యదర్శిలు కోళ్ల నాగేశ్వరరావు, వెండ్ర శ్రీనివాస్ లు మాట్లాడుతూ ఈఉగాది నుండి అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయుర్ఆరోగ్యాలు వెలుగొందాలని నూతన ఉత్సాహంతో ఎమ్మెల్సీ పట్టబద్దలు ఎన్నికల విజయాన్ని రానున్న ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో పునరావృత్వం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో వీరవాసరం మండల అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్ వీరవల్లి శ్రీనివాస్ భీమవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రేవు వెంకన్న కౌరు పృధ్విశంకర్ భీమవరం పట్టణ అధ్యక్షుడు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు నాయకులు తమ్మినీడి నాగేశ్వరరావు సయ్యద్ నశీమబేగం మాదాసు కనకదుర్గ బి.పద్మ గునుపూడి తిరుపాల్ పామర్తి వెంకటరామయ్య చల్లబోయిన గోవింద్ ముద్దుల రాము యరకరాజు గోపాలకృష్ణరాజు ఎస్కే రబ్బాని దొంగ వెంకటేశ్వరరావు చింతా కనకయ్య గూడూరి సుబ్బారావు మల్లువలస రాము శివకవి సాంబమూర్తి యలమంచిలి శ్రీనివాస్ బొక్క శ్రీనివాస్ పడమట సోమేశ్వరరావు కొయ్యలగడ్డ గణపతి బొడ్డు మోహన్ మరియు క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు గ్రామ,వార్డు అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.