- టీడీపీ జిల్లా కార్యదర్శి సవితమ్మ
ప్రజాశక్తి-పెనుకొండ : మాట తప్పడం మడమ తిప్పడంలో జగన్మోహన్ రెడ్డి తర్వాతనే ఎవరైనా అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి సవితమ్మ పేర్కొన్నారు. శనివారం పెనుకొండ పట్టణంలోని సవితమ్మ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నరరూప రాక్షసులు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు.నాలుగేళ్లలో జగన్ రెడ్డి మద్యం దోపిడీ 41 వేల కోట్లకు చేరిందని గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపానం అన్న జగన్ రెడ్డి నేడు అక్రమ సంపాదన కోసం మాట తప్పి మడమ తిప్పడం,బినామీలతో నాసిరకం మద్యం తయారు చేయించి ప్రజల ధన మాన ప్రాణాలను బలి తీసుకుంటున్నాడన్నారు.వైసిపి అధికారంలోకి రాగానే నేషనల్,ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లను రద్దు చేసి నాసిరకం మద్యం ను తయారు చేసి విక్రయించి వేలకోట్ల దండుకుంటున్నారని తెలిపారు.నాసిరకం మధ్యం లో విష రసాయనాలు ఉన్నట్లు చెన్నైలోనే ఎస్ జి ఎస్ ల్యాబ్ పరీక్షల్లో వెళ్ళడయిందని తెలిపారు.గంజాయి స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ వన్ అని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ డిఆర్ఐ నివేదిక విడుదల చేశారన్నారు.ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో కూడా సరఫరా చేస్తున్నారని, చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం అవుతున్నాయని, వాళ్ళ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో ఉన్నారన్నారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం కుదేలైనా గంజాయి సాగులో మాత్రం ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని ,ఒక నేరగాడిగా తానేంటో చూపించాడని జగన్ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అని చెప్పి గెలిచిన వెంటనే ఆ మేనిఫెస్టోని అబద్ధాల ఫెస్టోగా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అంటూ వైసీపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాధవ నాయుడు,మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు, గుట్టూరు మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, ఆడ దాకులపల్లి మాజీ సర్పంచ్ ప్రసాద్, మాజీ సింగిల్ విండో అధ్యక్షులు ఆంజనేయులు,మాజీ ఎంపీపీ నరసింహులు, నంజప్ప, త్రివేంద్ర నాయుడు మారుతి,మాజీ వైస్ సర్పంచ్ సుబ్రహ్మణ్యం,వాసుదేవరెడ్డి ,మంజు,తదితరులు పాల్గొన్నారు.










