Apr 03,2023 15:14
  • నార్పల తాసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగిన ఆలం వెంకట నరస నాయుడు

ప్రజాశక్తి-నార్పల : నార్పల మండలంలో ఇటీవల కాలంలో కురిసిన అకాల వడగండ్ల వర్షాల వల్ల తీవ్ర స్థాయిలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుతూ టీడీపీ  నాయకులు అలం వెంకట నరసానాయుడు ఆధ్వర్యంలో  రైతులతో కలసి సోమవారం నార్పల తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వాన వలన మండలంలోని పలు గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారని ముఖ్యంగా అరటి, బొప్పాయి రైతులు తీవ్రంగా నష్టపోయారనన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకి నష్ట పరిహారం అందజేయాలని అదేవిధంగా  పంట నమోదుకు సంబంధం లేకుండా పంట వేసిన ప్రతి రైతుకి నష్టపరిహారం  చెల్లించాలని  డిమాండ్ చేశారు.