Dec 05,2022 16:17
  • మాజీ మంత్రి టిడిపి నాయకుడు అమర్నాథ్ రెడ్డి

ప్రజాశక్తి-ఎస్ఆర్ పురం : అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అంటూ ఎన్నికలకు ముందు హామీలు గుర్తించి ప్రజా బలంతో గెలిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రస్తుతం కాంటాక్ట్ ఉద్యోగులు దాదాపు రెండు లక్షల 40 వేల మందిని నుంచి తొలగించడం దీనికోసం రహస్య జీవో పాస్ చేయడంతో ప్రభుత్వ సంస్థలలో పని చేస్తున్న కాంట్రాక్టర్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుస్తులను తొలగించడం దారుణం. కాంట్రాక్టు ఉద్యోగులు పరిస్థితి గోవిందా అని మాజీ మంత్రి టిడిపి నాయకుడు అమర్నాథ్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని క్షీరసముద్రము టిడిపి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి  రాజశేఖర్ నాయుడు ఇంటి వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇసుక, కల్తీ మద్యం, పెట్రోల్ ధరలు పెంపు, నిత్యవసర వస్తువుల ధరల పెంపు ఇలా అన్ని సమస్యలను గురించి మాట్లాడారు. గతంలో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని ఇసుక నిత్యవసర ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఉండేదని సామాన్య ప్రజలకు ధరలు అందుబాటులో ఉండే వన్నారు. రాజశేఖర్ నాయుడు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని  సాలువ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్, నాయుడు ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గంధం నేని రాజశేఖర్ నాయుడు, గుండయ్య బాలాజీ నాయుడు, బ్రహ్మయ్య నాయుడు, గురునాథం, మహబూబ్ బాషా, మాధవ నాయుడు వెంకటాచలం భూపతి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.