Mar 29,2023 12:08

ప్రజాశక్తి-కాళ్ల : మండలంలోని కలవపూడి, పెద అమిరం గ్రామాల్లో ఉండి మాజీ ఎమ్మెల్యే, శివ స్వచ్చంధ సేవా సంస్థ అధినేత వేటుకూరి వెంకట శివరామరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు 41 ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి డీసీ మాజీ చైర్మన్ తోట ఫణిబాబు  పాల్గొన్నారు. పెదఅమిరం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ వెంకటరావు, ప్రధాన కార్యదర్శి వెంకట కృష్ణ, సెబాస్టియన్, రత్నరాజు, వీరబ్రహ్మం, ఫణి, సాయి, మురలిరాజు, నందిరాజు, అప్పారావు,చక్రవర్తి, కలవపూడి గ్రామ పార్టీ అధ్యక్షులు నంబూరి త్రిమూర్తి రాజు, మణి బాబు, మార్రాజు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.