- టిడిపి కట్టిన ఫ్లెక్సీలు చింపివేతపై పాలకొల్లు పోలీసులకు ఫిర్యాదు
ప్రజాశక్తి-పాలకొల్లు : సామాజిక చైతన్య పాదయాత్ర సందర్భంగా టిడిపి దళితనేతలు కట్టిన డా.బి.ఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్, జ్యోతిరావు పూలే చిత్రపటాలు ఉన్న ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలిగించడం అన్యాయమని వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు టిడిపి దళిత నేతలు పట్టణ సిఐ డి రాంబాబుకు ఫిర్యాదు చేశారు.జాతీయ నేతలు ఫ్లెక్సీలు కనబడటానికి వీలులేదని, చించివేసి మురుగు కాల్వలో పడేయడం దారుణమని ఫిర్యాదు చేశారు. తమకు నోటీసులు ఇవ్వకుండా చింపి మురుగు కాల్వలో పడేసిన పంచాయతీ సెక్రటరీ, సచివాలయం, పోలీస్ లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జాతీయ నాయకులను అవమానపరిచే విధంగా, భారతీయుల మనోభావాలను అగౌరపరిచే, కించపరిచే విధంగా, సమాజంలో ఇప్పటికీ సంపూర్ణ రక్షణ ఏర్పడనటువంటి మా సామాజిక వర్గాలను భయబ్రాంతులకు గురి చేసే విధంగా ఫ్లెక్సీలు చింపివేయడం మాకు అత్యంత మనోవేదన కలిగిందని ఫిర్యాదు చేశారు.తగిన చర్యలు తీసికోకపోతే ఆందోళన చేస్తామని చెప్పారు.రాష్ట్రంలో S.C,S.T.B.C మైనారిటీ సామాజిక వర్గాలకు న్యాయం జరగాలని కోరుతూ ఎంఎల్ ఏ నిమ్మల రామానాయుడు సారధ్యంలో నియోజకవర్గ స్థాయిలో SC,ST,BC మైనార్టీ వర్గాలతో కలిసి చేపట్టిన సామాజిక చైతన్య పాదయాత్రలకు సంఘీభావంగా మాకు రాజ్యాంగపరంగా జీవించే హక్కును కల్పించిన డా.బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే,బాబూ జగ్జీవన్ రామ్ ఫోటో లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పీతల శ్రీనివాస్ సారధ్యం వహించారు.










