Oct 22,2022 15:50

ప్రజాశక్తి-గంగాధనెల్లూరు: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రక్తపాతం సృష్టిస్తే టీడీపీ మాత్రం అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడుతోందని నియోజకవర్గ టీడీపీ కో ఆర్డినేటర్ భీమనేని చిట్టిబాబు నాయుడు అన్నారు. గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ ప్రారంభించి ఈ రోజుకి 17వ రోజు సందర్భంగా వెదురుకుప్పం మండలంలోని గురసాల కిషన్ చంద్ కుమార్తె  గురసాల స్వరూప పుట్టినరోజు సందర్భంగా పలువురు టీడీపీ నేతలు కలిసి అన్నదాత150 మంది పేదలకు అన్న దానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కేతినేని లోకేష్ నాయుడు, స్వామిదాస్, జ్యోతిరెడ్డి , జ్యోతి యాదవ్, లోకనాధనాయుడు, దేవసుందరం, సుధాకర్ శెట్టి, జాన్, బుజ్జిబాబు పాల్గొన్నారు.