త్యాగమూర్తులను స్మరించుకుందాం: మంత్రి రోజా
ప్రజాశక్తి - నగరి: బానిస సంకెళ్ల నుంచి విముక్తి ప్రసాదించిన వర దాతలైన త్యాగమూర్తులను స్మరించుకుందామని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజనాభివద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. బుధవారం నగరి పట్టణ పరిధిలోని డాక్టర్ వైఎస్సార్ అర్బన్ హెల్త్‌సెంటర్ ఆవరణలో ఆజాదీ కా అమత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించిన నా మట్టి- నాదేశం కార్యక్రమంనకు మంత్రి, జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా జిల్లా కలెక్టర్‌తో కలిసి మొక్కలు నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో సమరయోధుల త్యాగనిరతితో పాటు స్వాతంత్య్రం ఎంత విలువైందో భావితరాలకు చెప్పేందుకు నా మట్టి నాదేశం కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సుజన, మున్సిపల్ చైర్మన్ నీలమేఘం, మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకష్ణ, మున్సిపల్ డీఈ నరేష్, హౌసింగ్ డీఈ శంకరప్ప, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే ప్రసాద్, సంబంధింత అధికారులు, కౌన్సిలర్లు మహిళా సమాఖ్య సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.










