ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ త్వరలో నగరంలో అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి తెలిపారు. ఈమేరకు గురువారం రుద్రంపేట పంచాయతీలో ఏర్పాటు చేసిన టిడిపి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో భాగంగానే నాలుగు పంచాయతీల్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే రాజీవ్ కాలనీ, చంద్రబాబు కాలనీలో ప్రారంభించామన్నారు. ఇప్పుడు రుద్రంపేట పంచాయతీలో ప్రారంభించామన్నారు. నిర్మాణాత్మకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకుంటూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లో చాటి చెప్పిన టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమాన్ని అందించిందని గురుత చేశారు. ఇందులో భాగంగానే ఇటీవలే నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నగరంలో దిగ్విజయంగా పూర్తయిందన్నారు. వైసిపి ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు విసుగు చెందారన్నారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అనంతరం పలువురు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌ఛార్జి గోపాల్‌గౌడ్, ఎస్‌ఎం బాషా, బోయపాటి బాలప్ప, మారుతీనాయుడు, వడ్డే మురళి, గోపాల్‌నాయుడు, గంగవరం అంజి, గంగవరం శివ, వెంకటేష్, శ్రీనివాసులు, గుత్తా వెంకటేష్, ఉప్పర శీన, పుల్లన్న, లక్ష్మన్న, నారాయణస్వామి, బొల్లినేని నరేంద్ర, సిద్ధప్ప, సుజాత, రాములమ్మ, రేణుక, ఆదిలక్ష్మి, అఖిల, తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌చౌదరి










