Jul 02,2023 21:32

ప్రజల నుంచి సంతకాల సేకరిస్తున్న సిపిఎం నాయకులు

           ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్‌  అనంతపురం రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయాన్ని టవర్‌క్లాక్‌ వద్ద ఉన్న స్థలంలోనే ఏర్పాటు చేయాలని సిపిఎం అనంతపురం రూరల్‌ మండల కమిటీ కార్యదర్శి టి.రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. ఆదివారం సిపిఎం రూరల్‌ మండల కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం రూరల్‌ గ్రామాల్లో ప్రజలతో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న తహశీల్దార్‌ కార్యాలయానికి రావాలంటేనే ప్రజలకు రవాణా ఛార్జీలు భరించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. రూరల్‌ తహశీల్దార్‌ కార్యాలయం కూడా రూరల్‌ కాలనీల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అలా ఏర్పాటు చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. కావున టవర్‌క్లాక్‌ సర్కిల్‌లో ఉన్న ప్రభుత్వం స్థంలోనే తహశీల్దార్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. సంతకాల సేకరించి కలెక్టర్‌ ఎమ్‌.గౌతమి, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదూర్తి ప్రకాష్‌రెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రూరల్‌ మండల కమిటీ సభ్యులు పుష్పరాజు, తిరుపాలు, చెన్నారెడ్డి, మోహన్‌రెడ్డి, తాటిచెర్ల, సోమలదొడ్డి, కందుకూరు, మన్నీల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.