Oct 18,2023 21:35

మాట్లాడుతున్న జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా

* జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా
ప్రజాశక్తి - శ్రీకాకుళం: 
జైల్లో ఉన్న నిందితుల కేసుల్లో పోలీసులు ఛార్జిషీట్లు త్వరగా దాఖలు చేయాలని జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో అండర్‌ ట్రయల్‌ ప్రిజనర్స్‌ సమీక్షా సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైల్లో ఉన్న నిందితుల కేసులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారి కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తులు భాస్కరరావు, ఫణికుమార్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్‌.సన్యాసినాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి గణపతి, ఎఎస్‌పి టి.పి విఠలేశ్వర్‌, జిల్లా జైలు సూపరింటెండెంట్‌ నబీఖాన్‌, పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.