
ర్యాలీ నిర్వహిస్తున్న తూర్పుకాపులు
ప్రజాశక్తి- కొత్తూరు: తూర్పు.కాపులను బిసి 'ఎ' లో చేర్చాలని మండలంలోని తూర్పు కాపులంతా ఒక్కటై గురువారం స్థానిక గోగుల కాంప్లెక్ నుంచి నాలుగు రోడ్లు కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహం వద్ద మనవహారంగా.ఏర్పడి నినాదాలు చేశారు. ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహశీల్దార్ ఎం.చక్రవర్తికి మెమోరాండం అందజేశారు. పార్టీలకు అతీతంగా నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో లోతుగెడ్డ తులసీ వర ప్రసాదరావు, కోయిలాపు శ్రీనివాసరావు, అగతముడి రంజిత్ కుమార్, చోడవరపు రాము, కర్నెన రమణ, పొగిరి రవి, ఎల్.తాత బాబు, చోడవరపు వెంకటరమణ, బానోజీరావు పాల్గొన్నారు.