తూకాలను పరిశీలిస్తున్న తూనికలు, కొలతల అధికారులు
ప్రజాశక్తి-కణేకల్లు మండల పరిధిలోని గంగలాపురం గ్రామంలో తూనికలు, కొలతల అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. గ్రామంలోని రైతుల పొలాల్లో వరిధాన్యాన్ని చెక్కత్రాసుల ద్వారా కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేయడాన్ని గుర్తించి జరిమానా విధించారు. ఈ సందర్భంగా గుంతకల్లు డివిజన్ తూనికలు, కొలతల ఇన్స్‌పెక్టర్ శంకర్ మాట్లాడుతూ ఒక్కో రైతు నుంచి ఒక్కో బస్తా నుంచి ఐదు కిలోల ద్వారా అదనంగా వరిధాన్యం సేకరిస్తునట్లు గుర్తించామన్నారు. దీంతో తూకాల్లో మోసం చేస్తున్న దళారులకు రూ.14 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అంతేగాకుండా ఎవరైనా చెక్కత్రాసులపై తూకాలు వేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










