Oct 19,2023 18:51

గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాంకుమార్‌రెడ్డి

ప్రజాశక్తి రాపూరు :నెల్లేపల్లి సచివాలయం పరిధిలో తుమాయి గ్రామంలో గురువారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన వైసిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వకర్త నేదురుమల్లి రామ్‌ కుమార్‌ రెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. గ్రామస్తులు.ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసు కోవాలని అది óకారులకు రాంకుమార్‌రెడ్డి సూచించారు. వైసిపి మండల కన్వీనర్‌ పాపకన్ను దయాకర్‌ రెడ్డి , మధుసూదన్‌ రెడ్డి ,,జేసిఎస్‌ ఇంచార్జి నారాయణరెడ్డి తో పాటు అల్లం చింప్పిరయ్య ,అల్లం వెంకటేశ్వర్లు చంద్రమోహన్‌ పెంచలయ్య ఉన్నారు.