Sep 02,2023 21:05

అవార్డు అందుకుంటున్న తట్రకల్లు కెజిబివి ప్రిన్సిపల్‌ ధనలక్ష్మి

         ఉరవకొండ : వజ్రకరూరు మండల పరిధిలోని తట్రకల్లు కేజీబీవీ కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.ధనలక్ష్మికి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసినట్లు రెడ్‌ప్లస్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఆర్గనైజేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షులు సయ్యద్‌ షేక్షావలి తెలిపారు. రెడ్‌ప్లస్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఆర్గనైజేషన్‌ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవలు అందించిన స్వచ్ఛంద సంస్థలు, సేవకులకు ఉద్యోగులకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శనివారం గుత్తిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ప్రిన్సిపల్‌గా ఎంపికైన తట్రకల్లు కెజిబివి కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.ధనలక్ష్మికి అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు గౌతమ్‌రాజు, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు హరిప్రసాద్‌, రెడ్‌ప్లస్‌ బ్లడ్‌ డోనర్స్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు షేక్‌ మాఫిర్‌, ఖాజామొయిద్దీన్‌, కెఎస్‌ మున్నా, లక్ష్కిరెడ్డి, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.