Jul 27,2022 22:11

తరలిపోతున్న ఇసుక
నిద్రావస్థలో అధికారులు
ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి:
మండలంలోని నెల్లిపట్ల పంచాయతీ పరిధిలోని మాదిగవాడ గ్రామ సమీపంలోని ఇసుకను అధిక మొత్తంలో నిల్వచేసి కొందరు అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. దాదాపు టాక్ట్రర్‌ లోడ్‌ ఇసుకను రూ.2500 నుంచి 3000ల వరకు అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కువ మంది పేదలు జగన్నన ఇళ్లు కడుతున్న నేపథ్యంలో వారికి తక్కువకే అమ్ముతున్నామని మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మండలంలోని ప్రభుత్వ అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు. పేదలకు తక్కువ ధరకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక అమ్మాలని నిబంధనలు ఉన్నప్పటికి కొందరు ఇష్టారాజ్యంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. దీని వలన ఎక్కువగా పేదలు నష్టపోతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.