ట్రైనీ కలెక్టర్‌గా మేఘస్వరూప్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
కర్నూలు జిల్లా నంద్యాల, నారాయణ పురంకు చెందిన మేఘ స్వరూప్ చిత్తూరు ట్రైన్ కలెక్టర్‌గా నియమితులయ్యారు. సెప్టెంబర్ 17,1990లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా పనిచేసే చంద్రశేఖర రావు, అరుణ దంపతులకు జన్మించిన మేఘస్వరూప్ వారణాసి ఐఐటిలో చదివారు. 2020లో ఐఏఎస్ సాధించిన ఈయన చిత్తూరులో ఉండి వివిధశాఖల మీద శిక్షణను పొందనున్నారు. ఈసందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్, జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌లను ఆయన గౌరవపూర్వకంగా కలిశారు.










