Jul 02,2023 21:47

మృతి చెందిన భార్యాభర్తలు

         బెలుగుప్ప : వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వస్తున్న భార్యాభర్తలను ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. వీరి ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడడంతో దంతులిద్దరూ ఘటనా స్థలంలోనే మరణించారు. బెలుగుప్ప మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నక్కలపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి(45), సువర్ణమ్మ(40) భార్యాభర్తలు. వీరిద్దరూ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ఆదివారం ఉదయం వారి తోటలో వ్యవసాయ పనులు ముగించుకుని ట్రాక్టర్లో ఇంటికి బయళ్దేరారు. ఈశ్వర్‌రెడ్డి ట్రాక్టర్‌ తోలుతుండగా భార్య ఆయన పక్కన కూర్చొంది. గ్రామ సమీపంలోని వంక వద్ద ఉన్న పెద్ద గుంతలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ బోల్దా పడింది. ట్రాక్టర్‌ ఇంజిన్‌ కింద భార్యాభర్తలు ఇద్దరూ పడిపోవడంతో అక్కడికక్కడే మతి చెందారు. అటుగా వెళ్తున్న తోటి రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రామకష్ణయ్య అక్కడికి చేరుకున్నారు. మతదేహాలను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు దంపతుల మృతి విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గం వైసిపి ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం తరుపున కుటుంబానికి అండగా ఉంటామని మృతుల కుమారుడు, కుమార్తెకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట మండల వైసిపి నాయకులు నక్కలపల్లి సర్పంచి రామిరెడ్డి, మండల కన్వీనర్‌ శ్రీనివాసులు, నక్కలపల్లి భాస్కర్‌ రెడ్డి, కరుణాకర్‌ ఉన్నారు.