ప్రజాశక్తి- అనంతపురం కలెక్టరేట్ నీలిమా టాకీస్ నుంచి తపోవ నం వరకూ ఉన్న రోడ్డు వెడల్పు చేయాలని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో నీలిమా ట్యాకీస్ నుంచి తపోవనం వరకూ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలిమా సర్కిల్ నుంచి తపోవనం వరకూ సిసి రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు. రిషితా స్కూల్ దగ్గర ఉన్న బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు, పాలక మండలి సభ్యులు మారిన తపోవనం వరకూ ఉన్న రోడ్డు 'ఎక్కడ వేసిన గొంగళి అక్కడే' అన్న చందంగా ఉందన్నారు. నగరంలో రోడ్ల విస్తీర్ణం చేపడుతున్నా తపోవనం రోడ్డుకు మాత్రం మోక్షం కలగడ ం లేదన్నారు. ఈ దారిలో ప్రయాణించాల ంటే నరకం కనబడుతోందన్నారు. ఇలాంటి చోట రోడ్డును వేయకుండా ట్రాఫిక్ తక్కువ ఉండే చోట రోడ్లు నిర్మిస్తున్నారని వాపో యారు. ఈ దారిలో రిషితా స్కూల్ దగ్గర బ్రిడ్జి పాడై పోయి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా పాలకుల్లో ఏమాత్రం స్పందన లేదన్నారు. గత సంవత్సరం వర్షాలకు అనంతపురానికి వరద నీరు రావడం కొన్ని వేల కుటుంబాలు వరదలో చిక్కు కోవడానికి ఈ బ్రిడ్జి ప్రధాన కారణమని తెలిపారు. వరదలు వచ్చినప్పుడు అధికారులు, పాలకు లు హడావిడి చేయడం తప్ప ఆ తర్వాత ఈ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ బ్రిడ్జి ఎత్తు పెంచడానికి పాలకులకు చేతులు రావడం లేదా అని ప్రశ్నించారు. చిన్న పాటి వర్షం వచ్చిన ఈ బ్రిడ్జి చుట్టూ నివసిస్తున్న కాలనీవాసులకు కంటిమీద కునుకు లేకుండా ఉందన్నారు. ఎక్కడ బ్రిడ్జి పొంగి ఇళ్ల లోకి నీరు వస్తుందో అని భయంగా ఉంటుందన్నారు. రంగస్వా మి నగర్, కాలనీవాసులు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదని తెలిపారు. అదేవిధంగా సీతా రామాంజనేయ గుడి దగ్గర ఉన్న కల్వర్టు పూర్తిగా కుంగిపోయినా వీరికి కనబడట్లేదని తెలిపారు. ఈ రోడ్డు సమస్యలు పరిష్కరించకపోతే ఈనెల 28న మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ప్రకాష్, వలి, వెంకటనారాయణ, నగర కమిటీ సభ్యులు మసూద్, ఎన్టీఆర్ శీన, రాజు, జీవ, గపూర్, నూరుల్లా ఆటో శివ, రామాంజి, విశ్వ, నాగయ్య, రాముడు తదితరులు పాల్గొన్నారు.
రిషిత పాఠశాల వద్ద మురికి కాలువను పరిశీలిస్తున్న సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి, నాయకులు










