'తపాల' ప్రైవేటీకరణను వ్యతిరేకించండి
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చైతన్య
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు అప్పజేప్పే ప్రయత్నం చేస్తోందని సుదీర్ఘ చరిత్ర ఉన్న తపాలశాఖను ప్రయివేటీకరించడాన్ని ప్రతిఘటించి కాపాడుకోవాలని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి చైతన్య పిలుపునిచ్చారు. తపాల శాఖ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం స్థానిక జిల్లా తపాల కార్యాలయం ఎదుటు తపాల ఉద్యోగులు విధులు బహిష్కరించి నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో తపాలా ఉద్యోగులు పోరాటానికి సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోని నవరత్న కంపెనీలు ఆదానీ, అంబానీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వరంగ సంస్థలైన బిఎస్‌ఎన్‌ఎల్, ఎల్‌ఐసి, తపాల, విద్యుత్ ఇలా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటుపరం చేసేందుకు పూనుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. అన్నివర్గాల ఉద్యోగులు, కార్మికులు మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలని అన్నారు. తపాల ఉద్యోగుల జేఏసి కన్వీనర్ ఏవి. భాస్కర్ మాట్లాడుతూ పోస్టల్‌శాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఒకరోజు నిరసన ధర్నా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. తపాలా శాఖ అభివద్ధికి ఉద్యోగులు ఎనలేని కషి చేశారన్నారు. ఐసిఐసి బ్యాంక్ అకౌంట్‌కి లిక్ ఆపాలని డిమాండ్ చేశారు. పోస్టల్‌శాఖలో ప్రైవేటీకరిస్తే ఉద్యోగంతోపాటు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఈప్రైవేటీకరణను ఉపసంహరించుకోకుంటే ఆందోళన ఉధతం చేస్తామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తపాలశాఖ జేఏసీ కార్యదర్శులు ఎం. దామోదరం, రాజశేఖర్, నారాయణరెడ్డి, రామ్మూర్తి శెట్టి, సర్దార్ దండపాణి, నాగముని పాల్గొన్నారు.
బంగారుపాళ్యం: తపాలశాఖను ప్రైవేటుకరించడం మానుకోవాలని తపాలశాఖ పిలుపుమేరకు బుధవారం చిత్తూరులో జరిగే బంద్‌కు స్థానిక తపాల కార్యాలయంనకు తాళాలు వేసి సిబ్బంది తరలివెళ్లారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే తపాలా కార్యాలయం మూతపడింది.










