అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో 06-01-2022 నుంచి 09-08-2023 వరకు జరిగిన 96,153 ఓటరు తొలగింపులు అన్నింటినీ పున్ణపరిశీలన పూర్తి చేశామని కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం అనంతపురం కలెక్టర్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో స్పెషల్ సమ్మర్ రివిజన్ - 2024, పోలింగ్ స్టేషన్‌ల రేషనలైజేషన్ తదితర అంశాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పున్ణపరిశీలనలో భాగంగా తొలగింపులను బిఎల్‌ఒలు 100 శాతం క్లెయిమ్స్ పున్ణపరిశీలన పూర్తి చేశారన్నారు. తొలగింపులకు సంబంధించి జాగ్రత్తగా పరిశీలన చేశామన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నామన్నారు. ఏ విధమైన ఫిర్యాదులు క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీల నాయకుల దష్టికి వచ్చినా తమకు తెలియజేయాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఈనెల 21వ తేదీనాటికి పోలింగ్ స్టేషన్ ల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. నగరంలోని ఈవీఎం గోడౌన్లలో పాత ఈవీఎంలను స్కాన్ చేసి పోలీస్ బందోబస్తుతో షిఫ్ట్ చేయడం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ కనకరాజు, ఎన్నికలు విభాగం సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.










