టంగుటూరికి ఘన నివాళి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: భారతీయ న్యాయనిపుణులు, సంఘసంస్కర్త, వలసవాద వ్యతిరేక జాతీయవాది అయినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని మంగళవారం జిల్లా సచివాలయంలోని గ్రీవిన్స్ హాల్‌లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, డిఆర్‌ఓ ఎన్.రాజశేఖర్, జిల్లా బిసి సంక్షేమశాఖ అధికారి రబ్బానీ బాష తదితరులు నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు 23ఆగష్టు 1872న పుట్టారని, 20మే 1957న మరణించారని తెలిపారు. మద్రాసు రాష్ట్ర విభజన ద్వారా బాషాపరంగా ఏర్పడిన పూర్వ ఆంధ్రరాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సైమన్ కమిషన్ 3 ఫిబ్రవరి 1928న మద్రాసును సందర్శించినప్పుడు, ప్రకాశం పంతులు 'గోబ్యాక్ సైమన్ కమి షన్' అనే నినాదాన్ని ఇచ్చారని, ఆంగ్లేయ సైనికులు ప్రకాశం నేతత్వంలోని ప్రదర్శనకారులను హెచ్చరించిన కదిలితే కాల్చివేస్తామని బెదిరించినా ప్రకాశంపంతులు ముందుకు వచ్చారు. దీంతో బ్రిటిష్ సైనికులు మూగబోయారని తెలిపారు. ఈ శ్రేష్ఠమైన ధైర్యం ఆయనకు 'ఆంధ్ర కేసరి' అనే బిరుదును తెచ్చి పెట్టిందన్నారు. ఈఘటన తర్వాత.. ఆంధ్రకేసరి (ఆంధ్ర సింహం)గా గుర్తింపు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఆయన దేశం కోసం చేసిన సేవలను గుర్తుంచుకొనేలా జయంతిని జరుపుకోవడం ఆనందనీయమన్నారు.
ప్రకాశం పంతులు సేవలు ఆదర్శనీయం: జడ్పీ ఛైర్మన్
వికోట: స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఆదర్శప్రాయమని చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. వికోట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఆంధ్ర రాష్ట్ర అభివద్ధికి ప్రకాశం పంతులు విశేషంగా కషి చేశారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీపీ యువరాజు, వైస్‌ఎంపీపీ తమీమ్‌ఖాన్, లక్ష్మణ్ రెడ్డి, జిల్లా పరిషత్ సలహామండలి సభ్యులు గౌస్, ఎంపీడీఓ బాలాజీతోపాటు సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సోమల: మండల కేంద్రమైన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ జయరాం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దపంజాణి: ఆంధ్రుల వెలుగు టంగుటూరి జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాబురెడ్డి, ఉపాధ్యాయులు మీనాక్షి, సుజాత, వాణిశ్రీ, ఆంజప్ప, రాజేష్ బాబు, చేతన పాల్గొన్నారు.
పలమనేరు: ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా పట్టణంలోని కళామందిరంలో మంగళవారం ఆయన ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీటిఎఫ్ రాష్ట్ర పూర్వప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద రావు, తెలుగు సాహిత్య సాంస్కతిక సమితి అధ్యక్షులు పి.తులసీనాదం నాయుడు, గురుమూర్తి, సుదర్శన చారి, శివశంకర్ రెడ్డి, పుష్ప, సుధానిధి, మంజుల, చిరంజీవి, భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
యాదమరి: కె.గొల్లపల్లె ఉన్నత పాఠశాలలో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని రాష్ట్రవేడుకగా జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టినారు. ఉపాధ్యాయులు త్రివేణి, కనకాచారి, మదన్ మోహన్‌రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్ రెడ్డి, చిన్నదొరై, మురళీధర్, వాణి, భారతి, ఉష తదితరులు పాల్గొన్నారు.










