Aug 23,2023 22:13

'టంగుటూరి' సేవలు మరువలేనివి..
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌:

నిరుపేద కుటుంబంలో పుట్టి, ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాటాలు సాగించి, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి, భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్‌ సగిలి షన్మోహన్‌ అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 151వ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలోని స్పందన మీటింగ్‌ హాల్‌లో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌.రాజశేఖర్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1953 నుంచి 1955 వరకు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారని, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటులో టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు ఎంతో విలువైనవని, ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తులలో ప్రకాశం ఒకరని, ప్రత్యేకాంధ్ర రాష్ట్రసాధనలో నిర్ణాయక పాత్ర పోషించారని తెలిపారు. కార్యక్రమంలో బిసి వెల్ఫేర్‌ అధికారి రబ్బానీ భాష, కలెక్టరేట్‌ ఏఓ కులశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.