ప్రజాశక్తి - ఆకివీడు
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం టిడిపి అధినేత చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని కాళింగగూడెం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు తప్పుబట్టారు. వెంటనే ఆయన మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కళింగ నాయకుడు రాజగోపాల్‌రావు విగ్రహం వద్ద బుధవారం సాయంత్రం టిడిపి నాయకుడు పూజారి ప్రసాద్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వెంటనే సీతారాం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. తమ్మినేని సీతారాంపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేయాలన్నారు. అనంతరం వారు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.










