ప్రజాశక్తి- కలకడ :తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలంటే పోషకాహారం ఎంతో అవసరమని ఎంపిపి శ్రీదేవి కుమార్ తెలిపారు.మండల కేంద్రమైన కలకడ వెలుగు కార్యాలయములో అంగన్వాడీ కార్యకర్తలతో నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ గర్భం ధరించినప్పటి నుండి ప్రసవించే వరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు.అలాంటి పోషకాహారాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అంగన్వాడి కేంద్రాలలో పంపిణీ చేయడం ఆశాజనకమైన కార్యక్రమాన్ని సూచించారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశాలున్నాయని, ఇందుకోసం తల్లి గర్భం దాల్చినప్పుడు నుండి పౌష్టికాహారం తీసుకోవాలని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి దేవ కుమారి తెలిపారు. అనంతరం వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ శివకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










