Mar 05,2022 21:27

మాట్లాడుతున్న ఫెడరేషన్‌ నాయకులు.


ప్రజాశక్తి -తిరుపతి సిటీ
స్థానిక యూత్‌ హాస్టల్‌ లో శనివారం జరిగిన సమావేశానికి బ్రిగ్రేటర్‌ వి. వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన చిత్తూరులో ఆసుపత్రి ఉందని, ఎక్కువ మంది ఆర్మీ ఉద్యోగులు ఉంటున్న తిరుపతిలో ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తే అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందన్నారు, తిరపతి లో ఆర్మీ రిక్రూట్మెంట్‌ కార్యాలయం కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు వినతిపత్రం అందజేశారన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ సైనికులు మనోహర్‌ రెడ్డి, గోపాల్‌, ఆనంద రెడ్డి, మోహన్‌ రెడ్డి, ఎం ఆర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.