Mar 10,2022 22:15

టీషర్ట్స్‌ను ప్రదర్శిస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)
గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1972లో ఏర్పాటు చేసిన డైనమోస్‌ ఫుట్‌ బాల్‌ అసోసియేషన్‌ చాలా మంది క్రీడాకారులకు జీవితంలో స్థిరపడడానికి ప్రత్యక్ష, పరోక్ష సహకారాలు అందించిందన్నారు. 11 నుండి 13 వరకు తిరుపతి తారకరామా స్టేడియం, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల మైదానాల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి ఇప్పటికే జిల్లా స్థాయిలో ఆడిన వారి టీమ్‌లతో లీగ్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. దీనికి స్పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, టీటీడి, రాష్ట్ర, కేంద్ర విభాగాల వారు తమ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారన్నారు. రాబోయో రోజుల్లో తిరుపతి ప్రాంతం నుండి మంచి ఫుట్‌ బాల్‌ టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎంఆర్‌.రాజా క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏఓ జయరాం, సీనియర్‌ కోచ్‌ బాలాజీ, మాజీ క్రీడాధికారి సుధాకర్‌, మునెయ్య, స్పోర్ట్స్‌ ఆథారిటీ సిఈఓ మురళీ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.