Sep 15,2023 23:18

తిరుమలలో రెండు పార్కులు ప్రారంభం

తిరుమలలో రెండు పార్కులు ప్రారంభం
ప్రజాశక్తి -తిరుమల: తిరుమల సుందరీకరణలో భాగంగా దాత రవికుమార్‌ సహాయంతో ఫిల్టర్‌ హౌస్‌ వద్ద, జిఎన్సీ వద్ద అభివద్ధి చేసిన రెండు పార్కులను శుక్రవారం రాత్రి టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి, ఈవో ఏవి.ధర్మారెడ్డి ప్రారంభించారు. ఫిల్టర్‌ హౌస్‌ వద్ద అన్నమయ్య సర్కిల్‌ పార్కును రంగురంగుల పూలమొక్కలు, పచ్చని మైదానంతో సుందరంగా రూపొందించారు. ఇక్కడి ఫౌంటెన్‌ లో అన్నమయ్య సంకీర్తనలు వినిపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్కు అభివద్ధికి రూ. 8 లక్షలు, ఐదేళ్ల పాటు నిర్వహణకు రూ.30 లక్షలను దాత అందించారు. జిఎన్సీ వద్ద రూపొందించిన పార్కులో 65 హై ఎండ్‌ ప్రొజెక్టెడ్‌ లైట్లు, శంకు చక్ర నామాలతో కూడిన ఫౌంటెన్‌ ఉన్నాయి. ఈ పార్కు అభివద్ధికి రూ.15 లక్షలు, ఐదేళ్ల నిర్వహణ కోసం రూ.80 లక్షలను దాత అందించారు. ఈ కార్యక్రమంలో జెఈవో వీరబ్రహ్మం, ఎస్‌ఇ-2 జగదీశ్వర్‌ రెడ్డి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసులు, డెప్యూటీ సీఎఫ్‌ శ్రీనివాసులు, ఈ ఈ శ్రీహరి, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.