Mar 05,2022 21:21

జస్టీస్‌ ఎన్‌వి.రమణకు స్వాగతం పలుకుతున్న


ప్రజాశక్తి -తిరుమల
శ్రీ పద్మావతి అతిథి గహాల వద్ద ఆయనకు టిటిడి చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, శాసనసభ్యులు భూమన కరుణాకరరెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్‌ జెట్టి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శ్రీ పద్మావతి అతిథి గహంలో టిటిడి ఏర్పాటు చేసిన 15 రకాల పంచగవ్య ఉత్పత్తులు, టిటిడి, వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం డ్రై ఫ్లవర్‌ టెక్నాలజితో ఆకర్షణీయంగా తయారుచేసిన శ్రీవారి ఫోటోలు, కీ చైన్లు, పేపర్‌ వెయిట్లతో ఏర్పాటు చేసిన స్టాల్‌ పరిశీలించారు. అంతకు ముందు జస్టిస్‌ ఎన్వీ రమణ అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణ శాలను సందర్శించారు. వేణుగోపాల స్వామి సేవలో పాల్గొని గో తులాభారం చెల్లించారు.