తిమ్మారెడ్డిపాలెంలో వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు
ప్రజాశక్తి - లింగసముద్రం :తిమ్మారెడ్డిపాలెం గ్రామ సచివాలయంలో గురువారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిమ్మారెడ్డిపాలెం, గంగపాలెం పంచాయితీలోని 408 మంది వివిధ రకాలైన వ్యాధులతో వచ్చిన వారికి నలుగురు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు అందజేశారు.వీరిలో 14 మందిని వివిధ కారణములతో పై హాస్పిటల్‌కు వెళ్ళాలని చవైధ్యులు సూచించారు. డాక్టర్ రమేష్, డాక్టర్ అనూరాధ, డాక్టర్ వర్షిత,డాక్టర్ వెంకటేష్ వైద్య పరీక్షలు చేశారు. ఎంపిడిఒ శేషుబాబు, సిహెచ్‌ఒ శ్రీనివాసులు, ఎంపిటిసి దగ్గు వెంకటేశ్వర్లు,తిమ్మారెడ్డిపాలెం సర్పంచ్ పద్మావతి, గంగపాలెం సర్పంచ్ పేలపల్లి మహేష్,పంచాయితీ కార్యదర్శి గౌస్ వైద్య సిబ్బంది ఉన్నారు.










